తనను పదేపదే కరోనా విరాళం గురించి అడుగుతున్న నెటిజెన్స్ పై శృతి హసన్ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో మీ బలవంతం ఏమిటని ఘాటు సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలకు చెందన ప్రముఖులు కరోనా వైరస్ వలన ఏర్పడిన కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు సహాయం కోసం ఏర్పడిన ఛారిటీ సంస్థలకు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాజల్, తమన్నా వంటి వారు లేటుగా స్పందించినా ఎంతో కొంత ఆర్థిక విరాళం ప్రకటించారు. ఐతే శృతి హాసన్ ఇంత వరకు ఎటువంటి విరాళం ఇవ్వకపోవడాన్ని కొందరు తప్పు బడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి స్పందనగా శృతి హాసన్, నాకు చేయాలని అనిపిస్తే చేస్తాను. ఈ విషయంలో మీ బలవంతం ఏమిటీ అన్నారు. ఇలా ప్రశ్నించే వారు చేసిన సాయం ఏమిటో చెప్పాలి అన్నారు. గతంలో ఆమె అనేక విధాలుగా ఇతరులకు సహాయపడినట్లు చెప్పారు.