బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ‘ఈఠా’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే, ఈ చిత్ర షూటింగ్‌లో ఆమె గాయాలపాలైనట్లు బి-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంలో కీలకమైన లవణీ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా శ్రద్ధ గాయపడింది. ఎడమ కాలి వేళ్లకు ఫ్రాక్చర్ కావడంతో ఆమెకు డాక్టర్లు రెండువారాల విశ్రాంతి సూచించడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. అజయ్-అతుల్ కంపోజ్ చేసిన ఈ లవణీ సాంగ్ అత్యంత కష్టతరమైనదిగా ఉండటంతో సంప్రదాయ నౌవరీ చీర, భారీ ఆభరణాల్లో ప్రాక్టీస్ చేయడం శ్రద్ధాకు మరింత భారమైంది.
తన పాత్ర కోసం శ్రద్ధా 15 కిలోలు బరువు పెరగడం, గాయపడినా కూడా క్లోజ్ షాట్స్ పూర్తిచేయాలని ఆమె కోరిందట. అయితే దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దీనికి అంగీకరించలేదు. ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆయన వెంటనే షూటింగ్‌ను నిలిపివేశారు.


