టాలీవుడ్ లో అగ్రతారలు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా వున్నారు. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో నిన్న అర్ధరాత్రి వరకూ మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ సినిమా పోరాటసన్నివేశాలను చిత్రీకరించారు
ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో హంసానందిని తో హీరో కలిసి ఒక అందమైన సెట్ లో నృత్యం చేస్తున్నాడు. ఇవే కాక నాగార్జున ‘భాయ్’ సినిమా షూటింగ్ కూడా స్టూడియోలో జరుగుతుంది. నాగార్ర్జున రీచా గంగోపాధ్యాయ్ మధ్య ఒక పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం