షాకింగ్ ట్విస్ట్: రజిని, కమల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దర్శకుడు

Rajini-174

రీసెంట్ గానే అనౌన్స్ అయ్యిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ నే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో అనౌన్స్ చేసిన సినిమా అని చెప్పాలి. తమిళ దర్శకుడు సుందర్ సి సారథ్యంలో తెరకెక్కనుంది అని అట్టహాసంగా అనౌన్స్ అయ్యిన ఈ సినిమా విషయంలో ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఇప్పుడు బయటకి వచ్చింది.

దీనితో ఈ సినిమా నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నట్టు షాకింగ్ ట్విస్ట్ ని అందించారు. అధికారికంగా ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసి తను కొన్ని అనివార్య కారణాల రీత్యా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. దీనితో ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా సినిమా అనౌన్స్ అయ్యిన కొన్ని రోజుల్లోనే ఈ సినిమాకి ఇలా జరగడం అనేది ఒక ఊహించని షాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అనేది మళ్లీ సస్పెన్స్ గా మారింది.

Exit mobile version