కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’

Kajal Aggerwal

మన తెలుగు సినిమా దగ్గర ఒకప్పుడు మంచి స్టార్డం చూసిన టాప్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. మరి కాజల్ ఇటీవల సత్యభామ సినిమాతో కూడా పలకరించింది. అయితే ఈ సినిమా కాకుండా పలు ప్రాజెక్ట్ లు, పర్శనల్ లైఫ్ లో బిజీగా ఉన్న సత్యభామ పై ఓ షాకింగ్ న్యూస్ లేటెస్ట్ గా వైరల్ గా మారింది.

అయితే కాజల్ కి యాక్సిడెంట్ అయినట్టుగా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనిపై కాజల్ ఇపుడు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాకు యాక్సిడెంట్ జరిగినట్టుగా కొన్ని ఆధారం లేని రూమర్స్ నా దగ్గరకి వచ్చాయి. కానీ నిజానికి నేను బాగానే ఉన్నాను సురక్షితంగానే ఉన్నాను అని తెలిపింది. అలాగే అందరికీ అలాంటి వార్తలు నమ్మొడు సర్క్యులేట్ చేయొద్దని విన్నవించుకుంటున్నట్టుగా ఆమె తెలిపింది.

Exit mobile version