నరసింహ నంది దర్శకత్వంలో శివాజీ

Shivaji-and-Narasimha-anand
’1940లో ఒక గ్రామం’, ‘హై స్కూల్’ సినిమాలను తీసిన నరసింహ నంది తన తదుపరి చిత్రాన్ని వెల్లడించాడు. సోషల్ డ్రామా తరహాలో సాగే ఈ సినిమా లివితా యూనివర్సల్ ఫిల్మ్స్ బ్యానర్ పై సునీల్ రెడ్డి నిర్మాణంలో శివాజీ హీరోగా తెరకెక్కుతుంది. చిత్రం గురించి నరసింహ నంది మాట్లాడుతూ “ఈ సినిమా వాస్తవీకతకు దగ్గరగా ఉంటుంది. పాత్రలు కుడా చాలా వాస్తవంగా ఉంటాయి. సినిమా మొదటి ఫ్రేము నుండి చివరి ఫ్రేము వరకూ వర్షంలోనే ఉంటుందని” చెప్పారు. సినిమాలో చాలా భాగం హైదరాబాద్, రాజమండ్రి, దార్జేలింగ్ మరియు సిక్కంలో ఉంటాది. చిత్ర బృందం అప్పుడే లొకేషన్ల వేటలో ఉన్నారు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రెండు షెడ్యూల్లలో సినిమాని ముగిస్తారు. మిగిలిన తారలు తదితర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version