ఆగష్టు చివరి వారంలో ‘శివ తాండవం’ ఆడియో

ఆగష్టు చివరి వారంలో ‘శివ తాండవం’ ఆడియో

Published on Aug 18, 2012 1:49 AM IST


విక్రమ్, అనుష్క, జగపతి బాబు మరియు అమీ జాక్సన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘శివ తాండవం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆగష్టు 27న జరగనుంది. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో యు.టి.వి మోషన్ పిక్చర్స్ తో కలిసి సి. కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రంలో విక్రమ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు, అందులో సీక్రెట్ ఏజెంట్ పాత్ర ఒకటి మరియు కళ్ళు కనిపించక పోయినా తన పగ తీర్చుకునే మరో పాత్రలో కనిపించనున్నారు. ‘నాన్న’ చిత్రం తర్వాత ఎ.ఎల్ విజయ్, అనుష్క మరియు జి.వి ప్రకాష్ కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో విక్రమ్ ‘ ఈ చిత్రం కోసం ఒక సంవత్సరం నుండి అందరం ఎంతో కష్ట పడి పనిచేశాం మరియు సినిమా చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు’. ఈ చిత్రంలో జగపతిబాబు పోలిస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు మరియు లక్ష్మీ రాయ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఎక్కువ భాగం చిత్రీకరణ లండన్, ఢిల్లీ, ఆగ్రా మరియు చెన్నైలలో జరుపుకుంది. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అతనికి 25వ సినిమా కావడం విశేషం.

తాజా వార్తలు