రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన క్లాసిక్ చిత్రం ‘శివ’ టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. యాక్షన్, రియలిజం, టెక్నికల్ ఎక్సలెన్స్‌తో 1989లో విడుదలైన ఈ సినిమా, అప్పటి తెలుగు సినిమాల పంథాను పూర్తిగా మార్చేసింది. ఈ లెజెండరీ ఫిల్మ్ ఇప్పుడు 4K డాల్బీ అట్మాస్ వెర్షన్లో నవంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సంబరాలలో భాగంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రి-రిలీజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రీ-రిలీజ్ ట్రైలర్లో మెగాస్టార్ చిరంజీవి, ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మణిరత్నం, నాగ్ అశ్విన్, శేఖర్ కమ్ముల వంటి సినీ ప్రముఖులు ‘శివ’ చూపిన ప్రభావం గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ ట్రైలర్ మళ్లీ ఆ రోజుల్లోని ఉత్సాహాన్ని, ఉత్కంఠను గుర్తు చేసింది.
నాగార్జున అద్భుతమైన నటన, వర్మ క్రియేటివిటీ, ఇళయరాజా సంగీతం అన్నీ కలసి ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్‌గా నిలిపాయి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో డాల్బీ అట్మాస్‌లో రీ-మాస్టర్ చేసిన సౌండ్, మెరుగైన విజువల్ క్వాలిటీతో ఈ చిత్రం కొత్తతరం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
