నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “షిరిడి సాయి” ఆడియో విడుదల జూలై 30కి మార్చారు. కే రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు గతంలో ఈ చిత్ర ఆడియోని ఆగస్ట్ 2 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు ఇక్కడ జరిగిన పత్రికా విలేఖర్ల సమావేశంలో నిర్మాతలు ఈ చిత్ర ఆడియో జూలై 30న విడుదల కానున్నట్టు ప్రకటించారు. శ్రీకాంత్ మరియు తనికెళ్ళ భరణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రం కోసం అద్భుతమయిన పదకొండు పాటలను స్వరపరచారని సమాచారం. ఏ మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.