శిరిడి సాయి – నెల్లూరులో 2 వారాల్లో అత్యధిక వసూళ్లు సాదించిన నాగార్జున చిత్రం


కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన భక్తి రస చిత్రం “శిరిడి సాయి” నెల్లూరులో అత్యధిక వసూళ్లు సాదించిన నాగార్జున చిత్రంగా పేరు సంపాదించుకుంది. ఈ చిత్రం రెండువారాలలో 53 లక్షల షేర్ ని సంపాదించింది గతంలో ఈ రికార్డ్ రెండు వారాలకి గాను 48 లక్షలు. నెల్లూరు టౌన్ లో మాత్రమే ఈ చిత్రం రెండు వారాలలో 18 లక్షల షేర్ ని రాబట్టింది. గతంలో ఈ టౌన్ లో నాగార్జున అత్యధిక రికార్డ్ 17 లక్షలు. కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు ఈ చిత్రాన్ని ఏ మహేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు నాగార్జున నటన మంచి ప్రశంసలు అందుకుంది.

Exit mobile version