టాలీవుడ్లో వరుస సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుని మంచి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసినా ఓ యాక్టర్‌కు అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రావడం లేదు. మలయాళంలో విలక్షణ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నటుడు షైన్ టామ్ చాకో టాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మీడియం, భారీ రేంజ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు షైన్ టామ్ చాకో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. విలన్ పాత్రలతో పాటు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ ఈ యాక్టర్ కనిపిస్తున్నాడు. కానీ, ఆయనకు తగిన గుర్తింపు రావడం లేదని ఆయన పర్ఫార్మెన్స్ చూసిన వారు చెబుతున్నారు. దసరా చిత్రంతో విలన్ పాత్రలో తనదైన పర్ఫార్మెన్స్ను ఇచ్చిన ఈ యాక్టర్, ఇటీవల వరుస చిత్రాలలో నటిస్తున్నాడు.
రీసెంట్గా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో కూడా షైన్ టామ్ చాకో ఓ సాధారణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో ప్రేక్షకులు ఆయన పాత్రల ఎంపికపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.