చైతు ‘లవ్ స్టోరీ’ మెయిన్ పాయింట్ అదేనా ?

చైతు ‘లవ్ స్టోరీ’ మెయిన్ పాయింట్ అదేనా ?

Published on Mar 20, 2020 3:00 AM IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో కుల వ్యవస్థకి సంబంధించి సున్నితమైన సమస్యను డీల్ చేయబోతున్నారని.. కుల ఆధారిత సమస్యనే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యంగా తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా మరో కథాంశం వినిపిస్తోంది. ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమికులకు తమ ప్రేమను త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పరిస్థితుల నుండి వాళ్ళు బయటపడలేకపోవడం, చివరికీ ఒకరికి తెలియకుండా ఒకరు తమ ప్రేమను ఎలా త్యాగం చేయాలనుకున్నారు.. ఈ క్రమంలో వాళ్ళు మళ్ళీ ఎలా కలిశారు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అట. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

ఇక బలమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల.. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.

తాజా వార్తలు