“ఆదిపురుష్”కు ముందు ఆమెనే అనుకున్నారా?

“ఆదిపురుష్”కు ముందు ఆమెనే అనుకున్నారా?

Published on Nov 7, 2020 8:06 AM IST

పాన్ ఇండియన్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలోనే తెరకెక్కించనున్నారు. అయితే ఈ భారీ చిత్రానికి సంబంధించి ఎప్పటి నుంచో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది.

చాలా మంది అగ్ర హీరోయిన్స్ పేర్లే వినిపించాయి కానీ ఎవరు ఫైనలైజ్ అవుతారు అన్నది మాత్రం ఇంకా అలా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఇప్పుడు తాజా ఓ టాక్ సినీ వర్గాల్లో మొదలయ్యింది. ఈ చిత్రానికి గాను మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెనే సీతగా అనుకున్నారట. కానీ అప్పటికే ప్రభాస్ తో ఆమె మరో సినిమాకు కమిట్ అయ్యి ఉండటం మూలాన మేకర్స్ వారి నిర్ణయాన్ని మార్చుకున్నారట.

అందుకే అక్కడ నుంచి ఈ రోల్ కు మేకర్స్ మొదలు పెట్టిన వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఈ చిత్రంలో ఎవరు ఆ రోల్ ను భర్తీ చేస్తారో చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో కనిపించనున్నారు. ఇక అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

తాజా వార్తలు