పవన్ కళ్యాణ్ టైటిల్‌ను వాడేస్తున్న శర్వా..?

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ మరో యూత్‌ఫుల్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడట. అయితే, ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారట.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయినా, బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ టైటిల్‌ను శర్వానంద్ తన నెక్స్ట్ మూవీ కోసం వాడనున్నాడట. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించనున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటించనున్నాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు జానీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Exit mobile version