శర్వానంద్-సమంత జంటగా నటించిన జాను మూవీ నేడు విడుదల అయ్యింది. దర్శకుడు సి ప్రేమ కుమార్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ని దిల్ రాజు నిర్మించారు. జాను మూవీ తమిళ హిట్ మూవీ 96కి తెలుగు రీమేక్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. స్కూల్ డేస్ లో ప్రేమలో పడిన ఓ జంట అనుకోకుండా చాలా ఏళ్ల తరువాత మళ్ళీ కలిస్తే వారి మధ్య ఎటువంటి ఎమోషనల్ జర్నీ కొనసాగుతుంది అనే పాయింట్ ఆధారంగా జాను తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో శర్వానంద్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు.
ఐతే ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో తన పెళ్లి గురించి అడుగగా ఆయన ఆసక్తిక సమాధానం చెప్పారు. తనకు మజిలీ సినిమాలో సమంత లాంటి అమ్మాయి కావాలట. తనను అంతలా పిచ్చిగా ప్రేమించే అమ్మాయి కావాలని శర్వా చెప్పుకొచ్చారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో శర్వా ఒకరు.