ఇప్పుడు మన తెలుగు సినిమా సహా సౌత్ సినిమా దగ్గర కూడా పలు సాలిడ్ థ్రిలర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి గత ఏడాది కల్కి 2898 ఎడి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వచ్చి అదరగొట్టింది. మరి ఈ తరహా లోనే వచ్చిన మరో సై ఫై థ్రిల్లర్ చిత్రమే ‘కలియుగం 2064’. జెర్సీ సినిమా బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలో ప్రమోద్ సుందర్ తెరకెక్కించిన ఈ సినిమా గత మే లో విడుదల అయ్యింది.
ఇక ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తెలుగు, తమిళ్ లో విడుదల అయ్యిన ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే తమిళ్ లో సన్ నెక్స్ట్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా తెలుగులో మన తెలుగు ఓటిటి యాప్ ఆహా లో అందుబాటులోకి వచ్చింది. సో ఈ సినిమాని చూడాలి అనుకునేవారు ఆహా లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి డాన్ విన్సెంట్ సంగీతం అందించగా కే ఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ లు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి