‘లవ్లీ’, ‘అడ్డా’ వంటి చిత్రాల్లో నటించిన శాన్వి ఒక పెద్ద చిత్రం లో నటించనుంది అని ప్రచారం జరుగుతుంది. శాన్వి ఆర్. జీ. వీ ‘రౌడీ’ లో హీరోయిన్ గా నటిస్తున్నప్పటి నుంచి ఈ నటి వెలుగు లోకి వచ్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్. జీ. వీ పూరి జగన్నాథ్ కి ఈ నటి పేరు ని రికమండ్ చేసాడు.
ఒక దిన పత్రిక తో మాట్లాడుతూ “ఆర్. జీ. వీ నాకు ‘రౌడీ’ లో శాన్వి పెర్ఫార్మన్స్ చూపించారు ఆ అమ్మాయి నటన నన్ను ఆకట్టుకుంది. తనకి మంచి స్క్రీన్ ప్రేసెన్స్ వుంది. తను అందం గా వుంది మంచి టాలెంట్ కూడా వుంది” అని పూరి జగన్నాథ్ తెలిపారు. మహేష్ బాబు లేక యెన్. టీ. ఆర్ హీరో గా రాబోతున్న తన తాజా చిత్రం లో శాన్వి నటించనుంది అని పూరి చెప్పనప్పటికీ. పూరి కి ఆ ఆలోచన రావడం తోనే శాన్వి ఆనందపడుతుంది.
ఇప్పటివరకు బబ్లి పాత్రల్లో నటిస్తున్న శాన్వి ‘రౌడీ’ లో ఒక సీరియస్ పాత్ర పోషించనుంది. ‘రౌడీ చిత్రం లో మోహన్ బాబు విష్ణు మంచు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వేసవి లో విడుదల కానుంది.