శంకర్ తెరకెక్కిస్తున్న మనోహరుడు సినిమా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాలో విక్రమ్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులు. ఆస్కార్ రవిచంద్రన్ ఈ భారీ బడ్జెట్ సినిమాకు నిర్మాత
ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయింది. ఈ పాట హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. విక్రమ్, శంకర్ లు పడ్డ కష్టం తెరపై అద్భుతంగా కనబడనుంది అని చిత్ర బృందం తెలుపుతుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ అయిన పీ.సి శ్రీరాం విక్రమ్ కెరీర్ లో ఇదొక మంచి సినిమా అని, తన నటనా ప్రావీణ్యం ఇందులో చూడనున్నాం అని తెలిపారు
ఈ సినిమాకు రెహమాన్ సంగీతదర్శకుడు. తెలుగు తమిళ భాషలలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. వేసవిలో ఈ చిత్రం మనముందుకు రానుంది