శంకర్ ఈ సెన్సేషన్ హీరోకి స్టోరీ రెడీ చేసారా?

శంకర్ ఈ సెన్సేషన్ హీరోకి స్టోరీ రెడీ చేసారా?

Published on Nov 11, 2020 12:06 AM IST


మన ఇండియన్ టాప్ దర్శకుల జాబితా తీస్తే కోలీవుడ్ దర్శకుడు శంకర్ పేరు ఖచ్చితంగా టాప్ 3 లో ఉంటుంది. తనదైన సినిమాలు తీస్తూ దేశ వ్యాప్తంగా అపారమైన గుర్తింపు తెచ్చుకున్న శంకర్ సినిమాలు అంటే ఒక బ్రాండ్ గా నిలిచాయి. తన సినిమాల్లో భారీ విజువల్స్ తో పాటుగా మంచి సందేశాన్ని ఇవ్వడం కూడా శంకర్ సొంతం. అందుకే శంకర్ చిత్రాలు అంటే ప్రతీ ఒక్క ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటాయి.

కానీ ఎంత పెద్ద దర్శకుడు అయినా సరే హెచ్చు తగ్గులు తప్పవు. అలాగే శంకర్ కు కూడా అంత సాలిడ్ హిట్ తగిలి చాలా కాలమే అయ్యింది. గతంలో రజినీతో తీసిన 2.0 కూడా ఓవరాల్ గా యావరేజ్ అనే అనిపించుకుంది.అయినప్పటికీ తర్వాత విశ్వ నటుడు కమల్ తో “భారతీయుడు 2″ను ప్లాన్ చేశారు. దానికి కాస్తా కరోనా బ్రేక్ వేసింది.

అయితే శంకర్ మాత్రం ఈ లాక్ డౌన్ లో కొన్ని సాలిడ్ స్క్రిప్టులను ప్రిపేర్ చేసుకున్నారట. వాటిలో లేటెస్ట్ సౌత్ సెన్సేషనల్ హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కు కూడా ఒక స్క్రిప్ట్ ను రెడీ చేసారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్ల కితమే శంకర్ మరియు యష్ ల కాంబో కోసం టాక్ వచ్చింది. ఇప్పుడు అది మరింత బలపడింది. మరి ఇదే కాంబో కనుక సెట్టయితే మరోసారి పాన్ ఇండియన్ లెవెల్లో సెన్సేషన్ నమోదు కావడం ఖాయం అని చెప్పాలి.

తాజా వార్తలు