పొగ క్లైమాక్స్ అంత బాగుంటుందా?

శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న చిత్రం “పొగ” ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుండి పరిశ్రమలో ఈ చిత్రం ప్రత్యేక చర్చ అయ్యింది. ఈ చిత్రం 4Dలో విడుదల చెయ్యాలని మొదట్లో అనుకున్నారు కాని సమయం సరిపోక నిర్మాతలు 2Dలో విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు. నవదీప్, మధు శాలిని, రన్దీర్ మరియు బిందు మాధవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర క్లైమాక్స్ అద్భుతంగా వచ్చింది అని వినికిడి. ఈ చిత్ర క్లైమాక్స్ చాలా ఆసక్తి కరంగా ఉండబోతుంది అని నవదీప్ కూడా అన్నారు. ఈ చిత్ర కథ బయటకి రానివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో ఏముంది అన్న విషయం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆనంద్ రంగ సహా నిర్మాణం అందిస్తున్న ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు . జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version