తన రాబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం “మనోహరుడు” కోసం శంకర్ మరో పొడవయిన షెడ్యూల్ ని చెయ్యనున్నారు. ఈ చిత్ర తమిళంలో “ఐ” అని పేరుతో వస్తుండగా ఈ చిత్రంలో కథానాయకుడిగా విక్రం నటిస్తున్నారు. ఏమి జాక్సన్ కథానాయికగా కనిపిస్తుండగా ఈ చిత్ర బృందం సెప్టెంబర్ 19న చిత్రీకరణ కోసం చైనా పయనమవనున్నారు, విక్రం మాత్రం సెప్టెంబర్ 21న ఈ బృందంతో కలవనున్నారు. గతంలో “జీన్స్” చిత్రం కోసం శంకర్ కొన్ని సన్నివేశాలను గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద చిత్రీకరించారు. ఈసారి భారతీయ తెర మీద ఎప్పుడు చూడనటువంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరపనున్నారు. శంకర్ దాదాపుగా 41 రోజులు చెన్నైలో ఒక పాట మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా పి సి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో కొంతమంది చైనా మరియు ఆస్ట్రేలియా వాళ్ళు కూడా బృందంలో పాల్గొంటున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.