తన అందాల ఆరబోతతో మలయాళ సినిమాను ఒక ఊపు ఊపిన షకీలా తరువాత చాలాకాలం తెరకు దూరమయ్యారు అడపాదడపా చిన్న పాత్రలు చేసినా పూర్తి స్థాయిలో చిత్ర రంగంలోకి తిరిగి రాలేదు. ప్రస్తుతం ఈమె తిరిగి చిత్ర రంగంలోకి ప్రవేశించదానికి సన్నాహాలు చేస్తుంది కాని ఈసారి నటిగా కాదు దర్శకురాలిగా, అవునండి మీరు చదువుతున్నది కరెక్టే షకీలా “నీలకురింజి పూతు” అనే ఒక మలయాళ చిత్రంకి దర్శకత్వం వహించనున్నారని మలయాళ చిత్ర వర్గాల సమాచారం. ఈ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంలో ఆమె కీలక పాత్ర కూడా పోషించనుంది. ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలి.