స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది తన స్టైలిష్ మెరుపు వేగపు డాన్స్ స్టెప్స్. మన ఇండియాలోనే అత్యద్భుతంగా డాన్స్ చెయ్యగలిగే టాప్ హీరోలలో బన్నీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆదరణను దక్కించుకున్నారు. అలా ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకుల దృష్టిని ఎప్పుడో తనవైపు తిప్పుకున్నారు.
దీనితో బన్నీ డాన్స్ పై చాలా మంది స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యిపోయామని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ జాబితాలో ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో చేరారు. అతనే మన తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసి సాలిడ్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్.
తన సోషల్ మీడియా ద్వారా జరిపిన ఓ చాట్ సెషన్ లో ఓ అభిమాని అడగగా బన్నీ లోని డాన్స్ నైపుణ్యం అంటే తనకు చాలా ఇష్టమని షాహిద్ కపూర్ సెలవిచ్చారు. దీనితో ఈ రిప్లై బన్నీ ఫ్యాన్స్ కు మరింత బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.