దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా ముంబై నగరంలో అత్యంత ప్రమాదక స్థాయిలో ఉంది. దీనితో ముంబై నగరంలో వేల మంది దీని బారిన పడ్డారు. ఇక బాలీవుడ్ ప్రముఖులలో అనేక మందికి కరోనా సోకడం జరిగింది. కొందరు మరణించగా కొందరు చికిత్స అనంతరం కోలుకున్నారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.
అత్యంత పటిష్ట భద్రత మధ్య ఉండే అమితాబ్ ఫ్యామిలీలో అభిషేక్, ఐశ్వర్య మరియు ఆరాధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీనితో సామాన్యుల పరిస్థితి ఏమిటి అనే సందేహం అందరిలో కలిగింది. కాగా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తన ఇంటికి కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాను ఉంటున్న నివాసంలోకి గాలి కూడా సోకకుండా ప్లాస్టిక్ కవర్స్ తో మూసివేశారు. కరోనా బారిన పడకుండా స షారుక్ తన ఇంటిని అలా కప్పివేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.