సెప్టెంబర్ 15 నుండి షాడో తరువాతి షెడ్యూల్


వెంకటేష్ రాబోతున్న చిత్రం “షాడో” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మధ్యనే ఈ చిత్రం ముంబైలో వాతావరణ పరిస్థితులు బాగాలేకపోయినా చిత్రీకరణ జరుపుకుంది. చిత్ర బృందం హైదరాబాద్ కి తిరిగి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్ర తరువాతి షెడ్యూల్ హైదరాబాద్లో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 1 వరకు జరగనుంది అని తెలిపారు. దీని తరువాత చిత్ర బృందం కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం మరోసారి మలేషియా వెళ్లనుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తాప్సీ నటిస్తుంది. శ్రీకాంత్ మరియు మధురిమలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథను అందించారు. పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 11 2013న విడుదల కానుంది.

Exit mobile version