హైదరబాదులో ‘షాడో’ చివరి షెడ్యూల్

హైదరబాదులో ‘షాడో’ చివరి షెడ్యూల్

Published on Nov 3, 2012 9:47 AM IST

విక్టరీ వెంకటేష్ విభిన్నమైన గెటప్స్ తో రాబోతున్న ‘షాడో’ చిత్ర చివరి షెడ్యూల్ హైదరబాదులో జరగనుంది. ఇటీవలే చిత్ర యూనిట్ మలేసియాలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది. మలేసియా షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. మరో వైపు ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు. చాలా రోజుల తరువాత వెంకటేష్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. వెంకటేష్ ఈ సినిమాలో డాన్ తరహా పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా తాప్సీ నటిస్తుంది. శ్రీకాంత్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా మధురిమ వెంకటేష్ సోదరిగా కనిపించబోతుంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు