శిల్పకళవేదికలో గ్రాండ్ గా విడుదలైన ‘షాడో’ ఆడియో

శిల్పకళవేదికలో గ్రాండ్ గా విడుదలైన ‘షాడో’ ఆడియో

Published on Mar 16, 2013 11:20 AM IST

Shadow Audio
విక్టరి వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘షాడో’ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆడియోని శుక్రవారం రోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళవేదికలో గ్రాండ్ గా లంచ్ చేయడం జరిగింది. ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన ఈ ఫంక్షన్ కి ఈ సినిమా నిర్వాహకులు అందరూ హాజరయ్యారు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ మరియు సింగర్ గీత మధురి ఈ ఫంక్షన్ కు వచ్చిన అభిమానులకు తమ మాటలతో ఎంటర్టైన్ చేశారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ఆదిత్య పంచోలి కూడా ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. అలాగే మిగితా తారలు తాప్సీ , శ్రీ కాంత్ లు ఈ సినిమా గురించి, పాటల గురించి మాట్లాడారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు