విక్టరీ వెంకటేష్ సరికొత్త అవతారంలో కనిపించనున్న ‘ షాడో’. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక మార్చి 7న శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ పవర్ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ డైరెక్టర్. ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో సీన్స్ అన్నీ బాగా వచ్చాయని మెహర్ రమేష్, అతని టీం చాలా హ్యాపీ గా ఉంది.
ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో తనని మెహర్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించాడని వెంకటేష్ చెప్పారు. తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్, మధురిమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పరుచూరి శివరాంప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.