షాడో స్టైలిష్ టీజర్ ఓకే, మరి సినిమాలో విషయం ఉంటుందా?


ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు వెంకటేష్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “షాడో”. నిన్న ఉదయం విడుదలయిన ఈ చిత్ర టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 66 సెకండ్ల ఈ టీజర్లో వెంకటేష్ చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇంతే కాకుండా ఈ టీజర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ ట్రేడ్ పండితుడు అయిన తరణ్ ఆదర్శ్ ఈ టీజర్ ని ప్రశంసించారు. టీజర్లోని విజువల్స్ బాలీవుడ్లో వచ్చిన ‘డాన్ 2’ చిత్రాన్ని పోలి ఉన్నప్పటికీ ఇలాంటి స్టైలిష్ సినిమా టాలీవుడ్ వారికి కొత్త కావడంతో ప్రేక్షకులు ఈ టీజర్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ‘బిల్లా’ సినిమాని కూడా మెహర్ రమేష్ స్టైలిష్ గానే తీశారు కానీ అందులో విషయం అంతగా లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్నైనా విషయం ఉన్న స్టైలిష్ సినిమాగా తీస్తాడా లేదా అనే దాని కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. టాలీవుడ్ బాక్స్ ఆఫీసు పై వరుస సినిమాలతో దండయాత్ర చేస్తున్నా మెహర్ రమేష్ కి విజయం రుచి అనేది ఎలా ఉంటుందో అనేది ఇప్పటికీ తెలియలేదు. ఈ చిత్రంతోనైనా మెహర్ రమేష్ ఆ విజయానందాన్ని ఆస్వాదిస్తాడేమో చూడాలి. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తాప్సీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్ మరియు మధురిమ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

షాడో టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version