సంక్రాంతి బరి నుండి తప్పుకున్న వెంకీ


విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘షాడో’ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల వాయిదా పడిందని స్వయంగా ఆయనే తెలిపారు. ‘ సినిమాకి సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కానందు వల్ల సినిమాని సంక్రాంతికి విడుదల చేయడంలేదని’ మెహర్ రమేష్ ట్వీట్ చేసారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ కాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీ కాంత్ కి జోడీగా మధురిమ నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో వెంకటేష్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

Exit mobile version