ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా అంతే స్థాయి హిట్ అయ్యింది. అలా ఇప్పటి వరకు మొత్తం నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. మరి ఈసారి నాలుగో సీజన్లో కొన్ని రోజుల కితమే పూర్తి అయిన సంగతి తెలిసిందే.
మరి ఈ గ్రాండ్ ఫినాలేకు కూడా అంతకు ముందు సీజన్ టీఆర్పీ కన్నా మించే టీఆర్పీ వస్తుంది అని అంతా అనుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు సెన్సేషనల్ రికార్డు టీఆర్పీ వచ్చింది. సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు 18.29 రేటింగ్ వస్తేనే ఆల్ టైం ఇండియన్ రికార్డు నెలకొల్పింది.
ఇప్పుడు దానిని బ్రేక్ చేసి ఏకంగా 19.51 టీఆర్పీ రేటింగ్ రావడం సంచలనంగా మారింది. చివరి నిమిషం వరకు గెస్ట్ ఎవరు అని చెప్పకపోవడం లాస్ట్ మినిట్ లో మెగాస్టార్ రంగ ప్రవేశం, టైటిల్ విన్నర్ ఎవరు అన్న అంశాలు ఈ ఎపిసోడ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. మరి మొత్తానికి ఈ సీజన్ కూడా క్లియర్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.