ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధించి ఇటీవలే ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో పుష్ప 2 ఇపుడు గ్లోబల్ లెవెల్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది.
ఆల్రెడీ వెస్ట్రన్ ఆడియెన్స్ లో పుష్ప 2 క్రేజీ రీచ్ ని అందుకోగా ఇపుడు వ్యూస్ పరంగా కూడా పుష్ప 2 భారీ రెస్పాన్స్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకుందట. ఇలా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 58 లక్షలకి పైగా వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకుందట. దీనితో ఈ మధ్య కాలంలో ఓ ఇండియన్ సినిమాకి బిగ్గెస్ట్ రికార్డు రెస్పాన్స్ అన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.