ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో తన రూల్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరి పుష్ప 2 హిట్ తర్వాత దర్శకుడు అట్లీతో భారీ సినిమా తాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ హీరోగా మరిన్ని భారీ ప్రాజెక్ట్ లు చేస్తుండగా వాటిలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా క్రేజీ ప్రాజెక్ట్ ఉందనిఎప్పుడు నుంచో టాక్ ఉంది.
నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రావణం అనే సినిమా నిర్మాణం వహిస్తారని టాక్ వచ్చింది. అయితే ఈ సెన్సేషనల్ బజ్ ని ఇపుడు నిర్మాత కన్ఫర్మ్ చేసేసారు. తమ కాంబినేషన్ లో ఈ సినిమా ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో దిల్ రాజు మెన్షన్ చేశారు. దీనితో అల్లు అర్జున్ మ్యాడ్ లైనప్ లో మరో ఊహించని కలయిక యాడ్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం వహించిన చిత్రం “తమ్ముడు” రిలీజ్ కి రాబోతుంది.