తారక్ నటన అద్భుతం..అతని సినిమా వేరే లెవెల్ – నటి అర్చన

తారక్ నటన అద్భుతం..అతని సినిమా వేరే లెవెల్ – నటి అర్చన

Published on Nov 18, 2020 8:00 AM IST

ఒక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ మినహాయిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొత్తం సినిమాలోని అన్ని కళలను అవపోసన పట్టినవాడు. జస్ట్ సింగిల్ టేక్ తో డైరెక్టర్ కు పెద్దగా పని కూడా పెట్టని తారక్ టాలెంట్ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఇక నటన విషయానికి వస్తేనా యంగ్ టైగర్ ఒక రోల్ లోకి పరకాయ ప్రవేశం చేస్తే దాని అవుట్ ఫుట్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరో స్థాయిలో ఉంటుంది.

అయితే ఒక అరుదైన నటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరియు తాను చేసిన జనతా గ్యారేజ్ చిత్రం కోసం కాస్త ప్రత్యేకంగా మాట్లాడారు. మన తెలుగులో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించే ఈటీవీ ఛానల్లో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాంకు దాదాపు 25 ఏళ్ళు తర్వాత కెమెరా ముందుకు వచ్చిన మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ హీరోయిన్ అర్చన.

“నిరీక్షణ” చిత్రంతో తెలుగులో మంచి ఫేమ్ అందుకున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. అలా ఓ సుదీర్ఘ విరామం అనంతరం 25 ఏళ్ళు తర్వాత మొట్ట మొదటి ఇంటర్వ్యూను ఇచ్చారు. చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడిన ఈమె ఓ సందర్భంలో ఆలీ తెలుగు సినిమా కోసం అడిగిన ప్రశ్నకు గాను సమాధానం చెప్పారు. రీసెంట్ గా నేను చూసిన చిత్రాల్లో అయితే “మహానటి” బాగా నచ్చింది అని అలాగే “జనతా గ్యారేజ్” కూడా వేరే లెవెల్లో అనిపించింది అని అన్నారు.

ఇక ఈ హీరో అద్భుతంగా చేసాడు అని ఎవరిని చూస్తే అనిపించింది అని అడగ్గా జనతా గ్యారేజ్ లోనే ఎన్టీఆర్ నటన చాలా నచ్చింది అని అన్నారు. ఎందుకు నచ్చిందో చెప్పడానికి కారణం కూడా చెప్పాలని మోహన్ లాల్ లాంటి ఒక లెజెండరీ నటుడు ఆ చిత్రంలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి స్పేస్ ఇచ్చి తన స్పేస్ తాను తీసుకొని మ్యాచ్ చేస్తూ నటించడం అనేది మామూలు విషయం కాదని దానిని ఎన్టీఆర్ చెయ్యగలిగాడని తారక్ నటనకు ఆమె కితాబిచ్చారు. అలాగే ఈ షో ద్వారా మరెన్నో విషయాలను పంచుకున్నారు.

తాజా వార్తలు