సీనియర్ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావుగారిది ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే. ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలతో అప్పటి తన అభిరుచి ఇప్పటికీ కొత్తగానే అనిపించేలా ముద్ర వేసిన డైరెక్టర్ ఆయన. వయసు 90 ఏళ్లకి సమీపంలో ఉన్నా సినిమాల గురించే ఆలోచిస్తూ ఇప్పటి ట్రెండ్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు.
బయోపిక్ సినిమాల హవా నడుస్తున్నందు వలన అదే పద్దతిలో ఒక బయోపిక్ తీసే ప్రయత్నాల్లో ఉన్నారట ఆయన. అది కూడా లెజెండరీ సింగర్ బయోపిక్ కావడం విశేషం. అయితే ఆ సింగర్ ఎవరనేది ఇంకా బయటకురాలేదు. మొదట ఈ వార్తలు ‘ఆదిత్య 369’ సీక్వెల్ తరహాలో పుకార్లే అనుకున్నా ఇప్పుడు మాత్రం వాస్తవమేనని, ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, అన్నీ కుదిరితే బయోపిక్ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.