హైదరాబాద్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఆర్య-అనుష్కల చిత్రం


ఆర్య, అనుష్క ప్రధాన పాత్రలలో రానున్న “భూలోకంలో నందకుమారుడు” చివరి షెడ్యూల్ నిన్న హైదరాబాద్లో మొదలయ్యింది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణే కాకుండా హారిస్ జయరాజ్ చివరి పాటను కూడా ఇక్కడ కంపోజ్ చెయ్యనున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చాలా భాగం హైదరాబాద్,చెన్నై మరియు జర్జియాలలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఒకేసారి “ఇరండాం ఉళగం” పేరుతో తెరకెక్కిస్తున్నారు. సెల్వ రాఘవన్ గతంలో “యుగానికి ఒక్కడు” వంటి అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పివిపి సినిమాస్ బ్యానర్ మీద ప్రసాద్ వి పోట్లురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version