కోలీవుడ్ కు చెందిన విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ తీసే సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పాలి. అలా తాను తీసిన ప్రతీ సినిమాకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. అయితే సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఓ అద్భుత చిత్రం “యుగానికి ఒక్కడు”. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చెయ్యగా దీనికి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది.
తమిళ్ మరియు తెలుగులో 2010లో విడుదల కాబడిన ఈ చిత్రం ఒక వండర్ లా నిలిచింది. మరి మళ్ళీ ఇన్నాళ్లకు ఈ అద్భుత చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించడం వైరల్ గా మారింది. అలాగే ఈ భారీ చిత్రాన్ని ఈసారి ధనుష్ హీరోగా తెరకెక్కించడం ఖాయం అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమాను వచ్చే 2024లో ప్రారంభించనున్నారు.
దీనితో ధనుష్ కూడా ఆ టైం వరకు ఇలాంటి సినిమాలో నటించడానికి వేచి ఉంటానని ఈ సినిమా ద్వారా మా బెస్ట్ అందిస్తామని తెలిపాడు. అలాగే 2024 లోనే యువరాజు తిరిగి వస్తాడు అన్నట్టుగా ముందు సినిమాకు రిలేటెడ్ గా ఆసక్తికర పోస్ట్ చేసాడు. ఇప్పుడు దర్శకుడు పోస్ట్ చేసిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ కూడా సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.
A magnum opus !! The pre production alone will take us a year. But a dream film from the master @selvaraghavan ! The wait will be long. But we will give our best to make it all worth it. AO2 ..The Prince returns in 2024 https://t.co/HBTXeN66iA
— Dhanush (@dhanushkraja) January 1, 2021