శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్ర విడుదల ఒక రోజు వాయిదాపడింది. గతంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయ్యనున్నాం అని శేఖర్ కమ్ముల ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల కానుంది. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను స్వయాన శేఖర్ కమ్ముల దగ్గరుండి పరిశీలించారు.ఈ చిత్రానికి ప్రత్యేకమయిన పబ్లిసిటీ చెయ్యాలని శేఖర్ కమ్ముల అనుకుంటున్నారు ఈ ప్రమోషన్స్ ఈ వారంలో మొదలు కానున్నాయి. అభిజీత్, సుధాకర్, కౌశిక్, శగున్, జర, రశ్మి, కావ్య, నవీన్, విజయ్, సంజీవ్ మరియు శ్రీ రామ్ ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. రెండు దశాబ్దాల తరువాత ఈ చిత్రంలో అమల అక్కినేని తిరిగి నటించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. శ్రియ సరన్ మరియు అంజలా జావేరీలు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.