జోరుగా జరుగుతున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ప్రమోషన్స్


శేఖర్ కమ్ముల మామూలుగా ఎంతో కూల్ గా ఉంటారు మరియు మిత భాషి. అతని మనస్తత్వం అతని సినిమాల్లో కనపడుతూ ఉంటుంది. అలాంటి శేఖర్ కమ్ముల గత కొన్ని రోజులుగా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. తన రాబోయే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర ప్రమోషన్ పనుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎంతో వినూత్నంగా అవుట్ డోర్ ప్రమోషన్స్ చేస్తున్నారు, అలాగే వరుసగా టాక్ షో లలో మరియు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

చిన్న చిన్న ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కి పోస్టర్లని మరియు స్పీకర్లని అమర్చి సిటీ మొత్తం ప్రచారం చేయిస్తున్నారు. ఇది చూసిన వారందరూ శేఖర్ కమ్ముల ఇంతకముందు తను తీసిన ఏ సినిమాకి ఇంత ఇదిగా ప్రచారం చేయలేదు కదా అని అనుకుంటున్నారు. ఇదంతా సినిమా మీద శేఖర్ కి ఉన్న నమ్మకం వల్ల చేస్తున్నాడా? లేక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ చేసి ఎక్కువ మందిని థియేటర్ కి రప్పించాలని చూస్తున్నారా? అని అడిగితే రెండూ కలిసే ఉంటాయని చెప్పాలి.

చిత్ర పరిశ్రమలో ఈ సినిమా పై మంచి పాజిటివ్ టాక్ ఉంది మరియు ఇదంతా చూస్తుంటే శేఖర్ చేతిలో మరో హిట్ సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version