ఉత్తమ విలన్ లుక్ వెనుక ఉన్న అసలు సీక్రెట్

theyam-and-uthama-villain
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ప్రింట్ చేసినట్టు ఉండే కమల్ ఫేస్, డిజైన్ కి దేశ వ్యాప్తంగా మంచి స్పందన, మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా మూవీ పోస్టర్ ఓ వివాదంలో ఇరుక్కుంది. ఎరిక్ లఫార్గు అనే ఫోటోగ్రాఫర్ తీసిన ‘తెయ్యం’ అనే ఫొటోగ్రాఫ్ కి ఉత్తమ విలన్ పోస్టర్ కి దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ విషయం పై కొంతమంది కమల్ హాసన్ ని కాపీ కొట్టారని అంటే కొంతమంది మాత్రం ఆయనని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ‘తెయ్యం’ అనేది ఆర్ట్ లో ఒక రూపం, దాని ఉపయోగించి పోస్టర్ తయారు చేసారు కానీ కాపీ కొట్టినది కాదని వారు అంటున్నారు.

Exit mobile version