‘కుబేర’ నుంచి మరో సాలిడ్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘కుబేర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను జూన్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్ర ఆడియోపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూన్ 20న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Exit mobile version