చక్ర నుండి విశాల్ మరో లుక్

తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో విశాల్ ఒకరు. యాక్షన్ హీరోగా తెలుగు మరియు తమిళ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన ‘యాక్షన్’ మూవీలో విశాల్ నటించారు. టెర్రరిజంపై పోరాడే కల్నల్ శుభాష్ గా విశాల్ నటించగా, తమన్నా అతని సహాయకురాలి పాత్ర చేశారు. కాగా మరో మారు విశాల్ మిలిటరీ అధికారి పాత్ర చేస్తున్నారు. చక్ర అనే టైటిల్ తో తెరకెక్కుతున్నచిత్రంలో విశాల్ ఆర్మీ అధికారి పాత్ర చేస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండగా నూతన దర్శకుడు ఆనందన్ తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

నేడు సంక్రాంతిని పండుగను పురస్కరించుకొని చక్ర నుండి మరో లుక్ విడుదల చేశారు. చక్ర ఒక సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. కాగా మరో వైపు విశాల్ తుప్పరివాలన్ కి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన తుప్పరివాలన్ తెలుగులో డిటెక్టివ్ గా విడుదలైంది. తుప్పరివాలన్ 2 చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version