ఫుల్ ఆన్ స్వింగ్ లో “సర్కారు వారి పాట”.!

వరుస పెట్టి మూడు అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్లు తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రాక్ మళ్ళీ అలాగే ఉండాలి అని మహేష్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్న తరుణంలో మొదలు పెట్టిన పక్కా మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట”. డీసెంట్ గా సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు పరశురామ్ తో మహేష్ స్టార్ట్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ మరియు సెట్టింగ్ పనులతో సన్నద్ధం అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో అంశంలో కూడా ఫుల్ ఆన్ స్వింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు అదే థమన్ ఈ సినిమా సాంగ్స్ వర్కింగ్ లో బిజీగా ఉన్నట్టు తెలిపారు.

ఈ చిత్రంతో పాటుగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “యువరత్న” ఫస్ట్ సింగిల్ అలాగే కీర్తి సురేష్ నటిస్తున్న “మిస్ ఇండియా” పాటలు కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు థమన్ తెలిపారు. ఇక ఇలాగే అన్నీ సెట్ అయితే మహేష్ సినిమా నుంచి అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను ఊహించినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

Exit mobile version