మహేష్ సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ టాలీవుడ్ ఆల్ టైం టాప్ 4 కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ ప్రభంజనం సృష్టించింది. కాగా నేటితో సరిలేరు నీకెవ్వరు మూవీ 25 రోజులు విజవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల సరిలేరు నీకెవ్వరు మూవీ హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. వైజాగ్ ఐకానిక్ ధియేటర్ జగదాంబ థియేటర్ లో 23రోజులలో ఒక కోటికి పైగా వసూలు చేసి బాహుబలి 2 పేరున ఉన్న రికార్డుని మహేష్ సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్లో ఉన్నారు. రెండు నెలలకుపైగా కొనసాగనున్న ఈ ట్రిప్ అనంతరం మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు . గత ఏడాది మహర్షి మూవీతో మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి మహేష్ కొరకు ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. మే నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనుంది.