ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సారంగపాణి జాతకం’

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన ప్రియదర్శి ఈ ఏడాది మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. కొన్ని నెలల కితమే కోర్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ని అందుకున్న తాను ఈ హిట్ తర్వాత తన నుంచి వచ్చిన మరో డిఫరెంట్ ఎంటర్టైనర్ చిత్రమే ‘సారంగపాణి జాతకం’. అండర్ రేటెడ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని అలరించింది.

ఇక ఈ చిత్రం లేటెస్ట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ గా సారంగపాణి జాతకం ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో ఇతర ముఖ్య భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version