“సంతాన ప్రాప్తిరస్తు” నుంచి మెలోడీ సాంగ్ లాంఛ్ చేసిన సురేష్ బాబు!

Santhana-Praptirasthu

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం నుంచి ‘తెలుసా నీ కోసమే..’ అనే లిరికల్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా పాటలు చాలా బాగున్నాయని, “సంతాన ప్రాప్తిరస్తు” మంచి మ్యూజికల్ హిట్‌గా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ పాటను టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ (‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’ ఫేమ్) కంపోజ్ చేయగా, శ్రీమణి ఆకట్టుకునే సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ ఈ పాటను ఆలపించారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు పుట్టకపోవడం అనేది నేటి బిజీ లైఫ్‌లో ఉన్న దంపతులకు పెద్ద సమస్యగా మారిందని, ఈ అంశాన్ని ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కుటుంబమంతా చూసేలా రూపొందించామని తెలిపారు. చిన్న చిత్రాల రిలీజ్ సమస్యలను సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో అధిగమిస్తున్నామని చెప్పారు.

రచయిత షేక్ దావూద్ జి, దర్శకుడు సంజీవ్ రెడ్డి, హీరో విక్రాంత్ తమ చిత్ర కథా నేపథ్యం గురించి వివరించారు. నేటి సమాజంలో దంపతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, సున్నితమైన భావోద్వేగాలను లైట్ హార్టెడ్‌గా ఈ చిత్రంలో చూపించామని తెలిపారు. విక్రాంత్ నటన, చాందినీ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.

Exit mobile version