నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ..‘టీమ్ అందరితో కలిసి ఈ టీజర్ ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ. నేను ఈవెంట్ కి రావడానికి కారణం నిహాల్. తను టీజర్ పంపించాడు. నాకు చాలా నచ్చింది. తను సినిమాని ప్రేక్షకుల వద్దకు చేరవేయానే ఆరాటం నాకు చాలా నచ్చింది. ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి. ఇది ఒక స్పై ఫిల్మే కాదు స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉంది. దర్శకుడు ఈ కథని నమ్మాడు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా’ అన్నారు .
డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. ‘మేము చాలా ఫ్యాషన్ తో ఈ సినిమాని క్రియేట్ చేశాను. కమల్ గారు కూడా ఈ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు. ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం వెరీ చాలెంజింగ్. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం. సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో నిహాల్ మాట్లాడుతూ.. ‘నేను నటించిన ఒక సినిమా చూసి సందీప్ కిషన్ గారు నా భుజాన చేయవేసి చాలా చక్కగా చేశావని మెచ్చుకున్నారు. ఆ క్షణం నేను మర్చిపోలేను. కష్టపడి సినిమాలు చేస్తే కచ్చితంగా సక్సెస్ వస్తుందనే దానికి సందీప్ కిషన్ గారు నిదర్శనం. తప్పకుండా ఆయనే మా సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలని నేను బలంగా కోరుకున్నాను. సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలుకని దానికి 100% కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది. డైరెక్టర్ విశ్వనాథ్ ఈ సినిమాతో ఒక కొత్త వాయిస్ ని తీసుకొస్తారు. తనకు కావాల్సింది వచ్చేంతవరకు ఎక్కడ రాజీపడరు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
దీక్ష పంత్ మాట్లాడుతూ..‘చాలా రోజుల తర్వాత మళ్లీ స్క్రీన్ పైకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ విశ్వనాధ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ద్వారా మీ అందరికీ మళ్లీ నచ్చుతానని భావిస్తున్నాను. సందీప్ కిషన్ గారికి థాంక్యూ. టీజర్ చాలా ప్రామిస్ గా ఉంది. సినిమాని బ్యూటిఫుల్ గా తీశారు.తప్పకుండా మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.