పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కాంబినేషన్‌లో విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన చిత్రం ‘బ్రో’. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, అనుకున్న స్థాయిలో మాత్రం ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇదే విషయంపై సముద్రఖని క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ‘కాంత’ మూవీ ప్రమోషన్స్‌లో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ లతో పాటు పాల్గొన్న సముద్రఖని ‘బ్రో 2’ మూవీపై అప్డేట్ ఇచ్చారు. ‘బ్రో 2’ స్క్రిప్టు రెడీగా ఉందని.. అన్నగారు సిగ్నల్ ఇస్తే ప్రారంభిస్తామని పవన్‌ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు.
ఈ అప్డేట్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక తమ అభిమాన హీరో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తారా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.


