ప్రభుత్వ గుర్తింపు పొందిన సమంత చారిటబుల్ ట్రస్ట్

Actress_Samantha
అందాల భామ సినీ నటి సమంత కొంత కాలంగా ఒక చారిటీ నడుపుతోందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆమె మహిళలు మరి చిన్న పిల్లల కోసం ‘ప్రత్యూష’ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించింది. తాజాగా ఈ ఆర్గనైజేషన్ కి ప్రభుత్వ గుర్తింపు లభించింది. సమంత స్వయంగా ఈ వార్తని తెలియజేసింది.

ఇప్పటికే సమంత ఈ ఆర్గనైజేషన్ కోసం ఫండ్స్ కలెక్ట్ చెయ్యడం కోసం పాపులర్ సినీ హీరోల కాస్ట్యూమ్స్ ని వేలం వేస్తోంది. తను ఇప్పటికే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో వేసుకున్న డ్రెస్, మహేష్ బాబు దూకుడులో వేసుకున్న డ్రెస్ లని సేకరించింది. ఈ చారిటీ ద్వారా ఎంతోమంది చిన్న పిల్లలని మరియు మహిళలను ఆదుకుంటున్నారు.

మాములుగా సమంత సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో బాగా చురుకుగా పాల్గొంటుంది. ఇప్పుడు తన చారిటీ సంస్థకి ప్రభుత్వం పరంగా గుర్తింపు రావడంతో ముందు ముందు ఇంకా చురుగ్గా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Exit mobile version