దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్స్ బాధితురాలికి సాయం అందించిన సమంత ఫ్యాన్స్

దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్స్ బాధితురాలికి సాయం అందించిన సమంత ఫ్యాన్స్

Published on Apr 27, 2013 9:03 AM IST

Samantha-with-Dilsukhnagar-

అందాల భామ సమంత ప్రస్తుతం సౌత్ ఇండియాలో పాపులర్ హీరోయిన్ గా వెలుగొందడమే కాకుండా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. అందరి హీరోయిన్ల ఫ్యాన్స్ తో పోల్చుకుంటే సమంత ఫ్యాన్స్ కాస్త డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు, మంచి కారణం కోసం ప్రజలని కలుస్తూ ఉంటారు. ఇలాంటివి టాప్ హీరోల ఫ్యాన్స్ చాలా కామన్ గా చేసే అంశాలు కానీ హీరోయిన్ ఫ్యాన్స్ చేయడం చెప్పదగిన విశేషం.

ఇటీవలే హైదరాబాద్ ని షాక్ కి గురిచేస్తూ దిల్ సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఈ దుర్ఘటనలో ఎం.బి.ఎ చదువుతున్న రజిత అనే అమ్మాయి తన కాలిని పోగొట్టుకుంది. ఆమె కాలు పోవడంతో ప్రస్తుతం ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. ఆమె గురించి తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ ఆమెకి రూ. 50,000/- రూ ఆమెకి సాయం చేసారు. ఈ చెక్ ని రజితకి అందజేయడానికి సమంతని అతిధిగా పిలిచారు. సమంత రజితని, ఆమె ఫ్యామిలీని కలిసి చెక్ అందజేశారు. అలాగే ఇంకా ఏమన్నా అవసరం ఉన్నా హెల్ప్ చేస్తానని సమంత రజితకి మాటిచ్చింది. ఆన్ స్క్రీన్ పై కాకుండా కాకుండా సమంత, ఆమె ఫ్యాన్స్ కలిసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినదించదగిన విషయం.

తాజా వార్తలు